మానవ జన్మలో బాల్యం, కౌమారం , యవ్వనం మరియు వృద్దాప్యం అనే నాలుగు దశలు త్పపనిసరి. బాల్యంతో తల్లి తండ్రులు, కౌమారంలో స్నేహితులు, యవ్వనం లో భార్య సహకారం వుంటుంది. కానీ వృద్దాప్యంలో మాత్రం ఎవరూ తోడు, నీడ కల్పించటంలేదు. వృద్దాప్యంలో వారికి ప్రేమ, ఆసారా, ఆదరణ మరియు ఆరోగ్యం కలృస్తే జీవితం సంతొషంగా, సాఫీగా సాగిపోతుంది.
ఈ రోజుల్లో పిల్లలు, తల్లి తండ్రులు సంపాదించన ఆస్తులను అనుభవిస్తూ, వారికి భవిష్యత్తును ఇచ్చిన వారిని విస్మరించి, వీధుల పాలు చేస్తూ, ఆశ్రమాల్లో చేర్పించి మనో వేదనకు గురి చేస్తూన్నారు మరియు మానవ విలువలను మరిచిపోతున్నారు.







