విద్య (చదువు)

ఈ సమాజంలో మనిషి మనుగడ సాధించాలంటే పోటీతతాన్ని, అలవర్చుకోవాలి, దానికి మూలం విద్య. “విద్య లేని వాడు వింత పశువు అన్నారు. అర్దిక పరిస్దితి మూలంగా చాలా మంది పేద విద్యర్థులను గుర్తించి వారికి పుస్తకాలు, వస్తములు, కంచాలు, మరియు అర్ధిక సహయాన్ని అందించి వారి అవసరాలను తీరుస్తున్నాము.


ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహించినాము.

  • తల్లి తండ్రులు, వృద్దులు - దివ్యాంగుల పట్ల మన బాద్యత అనే అంశాలపై వ్యాసరచన, వకృత్వ పోటీలను నిర్వహించాము.
  • భద్రాచలం డివిజన్, దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం హ్తెస్కూల్ నందు 65 మంది విద్యర్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు అందించినాము.
  • దుమ్ముగూడెం మండలం, మారేడుబాక, అంగవ్వాడీ విద్యర్థులకు మరియు కొయ దుమ్ముగూడెం అంగవ్వాడీ విద్యర్థులకు పుస్తకాలు, కంచాలు, పలకలు, పెన్నులు, పంపిణీచేసాము.
  • భద్రాచలం మండలం, ఎటపాకగ్రామం, కహల్ అనాధ అశ్రమం పిల్లలకు నిత్య అవసర వస్తువులు, కంచాలు, వస్ర్తాలు, గ్లాసులు అందించినాము.
  • భద్రాచలం రంగనాయకుల గట్టు స్కూల్ నందు 70 మంది విద్యర్థులకు పుస్తకములు, పలకలు, పెన్నులు, బాక్స్ లు అందించినాము.