మానవత్వం, సమానవత్వం అనే అంశాలను ఆధారంగా చేసుకొని ఆసరా లేని వృద్దులకు, దివ్యంగులకు భోజనము, వస్త్రములు, విధ్య మరియు వైద్యం అనే మౌళికమైన అవసరాలను తీర్చాలని మిత్రుల సహాయ,సలహా సంప్రదింపులతో "నేను సైతం" అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఓక వేదికగా ది. 31-10-2012 న నెలకొల్పి, రిజిస్టర్ చేయించటం జరిగినది.
నేటి తరం పిల్లలు తల్లి తండ్రుల, కుటుంబాల, సమాజం పట్ల అవగాహన కల్పించి, చైతన్య పరచటం ఈ సంస్థ చేపుతుంది.
నాటి నుండి, నేటి వరకు నిరంతరం సామాజిక సేవలో పుర ప్రజల మన్నలను పొందతూ వృద్దులు, దివ్యాంగులు మరియు విద్యార్ధుల సేవలో నేను సైతం ముందుకు సాగిపోతుందని తెలియచేస్తున్నము.

"నేను సైతం " భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు (vision)
- వృద్దులను, దివ్యాంగులను చేరదీసి వారికి కొడుకులు, కూతుర్లు లేని లోటు తీర్చి, చివరి దశలో వారు సంతోషంగా ఉండటానికి ఒక వృద్దాశ్రమం నెలకొల్పుట.
- అనాధ పిల్లలను చేరదీసి వారికి తల్లిదండ్రులు లేని భావన రాకుండా వారికి అనాధ ఆశ్రమం ఏర్పాటు చేసి విద్యను అందించుట.
- ఒక విద్యాలయాన్ని ఏర్పాటుచేసి విద్యర్ధులకు IIT foundation తో కూడిన విద్యను అందించుట.
- గ్రామీణ ప్రాంతాలలో బడి మానేసిన విద్యార్ధులను చేరదీసి వారికి ఉపాది, విద్యను అందించుట.
- ఆకలితో అలమటిస్తున్న వారికి సంచార వాహనం ద్వారా ఆహార పదార్ధాలను అందించుట.
- చనిపొయిన అనాద పార్ధివదేహాలను ఒక సంచార వాహనాన్ని ఏర్పరచి ఉచితంగా దహన సంస్కారాలు చేయించుట.