గుడ్డ(బట్టలు)

ఈ ప్రపంచంలో సమస్త జీవరాసులలో కన్నా మానవ జీవితం చాలా ముఖ్యమైనది ఒక్క మనిషి కి మాత్రమే ఆలోచించే శక్తి ఆచరించగల యుక్తి కలిగి యున్నాడు . ఇది భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం. అందుకే ఆక్కలి తీరిన మనిషి ఆ సమాజాన్ని చూసి చాలా నేర్చుకున్నాడు . అందులో భాగం గానే సంస్కృతి , ఆచార అలవాట్లును నేర్చుకున్నాడు . తన శరీరాన్ని బట్టలతో కప్పుకున్నాడు . ఎదుటి వారి పట్ల మర్యాదగా నడుచుకుంటూ జీవిస్తున్నారు.

కాని ఎంతోమంది అనాధ వృద్దులు , విద్యంగులు ఒంటికి బట్టలు లేక , కొనే స్తోమత లేక , చెట్ల క్రింద , గుడిసెలలో ఎన్నో ఇబ్బందులు పడుచున్నాడు . ఆసరా కోసం ఎదురు చూస్తున్నాడు . వారి అందరికీ మనం సహాయం చేయలేక పోవచ్చు. కానీ స్నేహితుల సహకారం మరియు దాతల సహాయంతో వున్నంతలో ఆపద లో ఉన్న , నిరాదారణ కు గురై , కొడుకులు చూడక పిల్లలు లేని వ్రుద్దులను చేరదీసి వారికి ప్రతీ సంవత్సరం 2 జతల బట్టలు , దుప్పట్లు నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ వేదిక పై నుండి అందిస్తూ పుర ప్రజల మన్నలను పొందుతూ ఏంటో సంతోషంగా గర్వంగా ముందుకు సాగిపొతున్నాం అని తెలియ జేస్తూన్నాము.