కూడు (అన్నము)

ఈ సమాజంలో ప్రతీ జీవి పుట్టినది మొదలు,మరణించే వరకు మొదటి అవసరం ఆకలి తీర్చుకోవటం,ఆ తరవాటీ బంధాలు,అనుబంధాలు సుఖ దుఖాలు.ఆకలి గొన్న వారికి ఏమి చెప్పినా అర్ధంకాదుకాబట్టి అతని ఆకలి తీర్చటం కనీస ధర్మం.అదే మానవ జన్మకు సార్ధకత,భగవంతుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వున్నదానిలో ఏంతో కొంత సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం.తోనే మిత్రుల సహాయం తో ఒక వేదిక ఏర్పాటు చేస్తుకొని,(నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ)భద్రాచలం లోని అన్ని కాలనీలు తిరిగి నిరాదారణకు గుర్తెన ఆసరా లేని వృద్దులను మరియుదివ్యాంగులను 100 మందిని చేరదీసి వారికి ప్రతి నెలా మొదటి ఆదివారం నాడు 5 కేజీ ల బియ్యాన్ని పంపిణీ చేసి (5 క్వింటాలు)వారి ఆకలి తీర్చే ప్రయత్నాన్ని"నేను సైతం" స్వచ్ఛంద సేవాసంస్త చేస్తుంది.

ఈ సహాయంతో మేము మా మిత్రులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఎదుటి వారికి సహాయం చేయటంలో ఉన్న తృప్తి ఎందులోనూ దొరకదు అని ఆ సందర్భంగా చెప్పక తప్పదు.ఆకలి తో అలమటిస్తున్నవృద్దులు మరియు దివ్యాంగులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో చేస్తూన్న ఆ చిరు ప్రయత్నానికి దాతల సహకారం మరియు దేవుని ఆశీర్వాదం వుంటుంది అని గత 4 1/2 సంవత్సరాల నుండి అన్నార్తులకుఅండగా నిలబడుతుంది అని తెలియ చేస్తున్నాము.